మణిరత్నం చిత్రంలో జ్యోతిక

‘చెలియా’ చిత్రం తర్వాత మణిరత్నం రూపొందించబోయే సినిమా విషయంలో రకరకాల ఊహాగానాలు వినిపించాయి. రామ్‌చరణ్‌తో సినిమా ఉంటుందని, బాలీవుడ్‌లో కూడా ఓ సినిమా చేయబోతున్నారని సోషల్‌ మీడియాలో భిన్న వార్తలు చక్కర్లు కొట్టాయి. తాజాగా సమాచారం మేరకు విజరు సేతుపతి, ఫహాద్‌ ఫాజిల్‌ హీరోలుగా మణిరత్నం ఓ సినిమాని తెరకెక్కించేందుకు ప్లాన్‌ చేస్తున్నారట. అలాగే ఓ కీలక పాత్రలో జ్యోతిక కూడా మెరవనుంది. ‘త్వరలో మణిరత్నం దర్శకత్వంలో నటించబోతున్నాను. ఇది ఆయన అనుమతితోనే జరిగింది’ అని జ్యోతిక తెలిపారు. ప్రస్తుతం బాల దర్శకత్వంలో ‘నాచియార్‌’ చిత్రంలో పోలీస్‌ ఆఫీసర్‌గా జ్యోతిక నటిస్తున్నారు. అలాగే ఆమె నటించిన ‘మగలిర్‌ మట్టుం’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.