మంచి జోరుమీదున్న ర‌కుల్!

వ‌రుస సినిమాల‌తో మంచి జోరుమీదుంది ర‌కుల్ ప్రీత్ సింగ్. కేవ‌లం తెలుగు సినిమాలే కాదు అటు కోలీవుడ్‌, ఇటు బాలీవుడ్ సినిమాల‌తో క్ష‌ణం తీరిక లేకుండాట టైం గ‌డుపుతుంది . ర‌కుల్ న‌టించిన రారండోయ్ వేడుక చూద్దాం.. జయ జానకి నాయక సినిమాలు రీసెంట్‌గా విడుద‌ల కాగా, ఇవి మంచి విజ‌యం సాధించాయి. ఇక ఇప్పుడు మ‌హేష్ స‌ర‌స‌న క‌థానాయిక‌గా జ‌త‌కట్టి న‌టించిన స్పైడ‌ర్ చిత్రం విడుద‌ల‌కి సిద్ధమైంది. ఈ మూవీపై భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉన్నాయి. ఈ చిత్రం ర‌కుల్‌కి మంచి పేరు తెస్తుంద‌నే అభిప్రాయంలో మూవీ యూనిట్ ఉంది. ర‌కుల్ ఇంతకుముందు హిందీలో యారియా అనే సినిమా చేయ‌గా, ప్రస్తుతం సిద్ధార్ధ్ మల్హోత్రా హీరోగా నటిస్తున్న అయ్యారీ సినిమా చేస్తుంది. నీరజ్ పాండే దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. మనోజ్ బాజ్ పాయి మరో కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం ఇద్దరు ఆర్మీ ఆఫీసర్ల నిజ జీవితంలోని సంఘటనల ఆధారంగా రూపొందుతుంది. ఈ సినిమా షూటింగ్ కోసం ఢిల్లీ వెళ్లి వ‌స్తుంది ర‌కుల్‌. ఆ మ‌ధ్య‌ స్పైడ‌ర్ షూటింగ్ కోసం రొమానియా వెళ్లిన బ్యూటీ, ఈ చిత్ర త‌మిళ వేడుక‌కి చెన్నై వెళ్ళింది. మ‌ళ్ళీ హైద‌రాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి అటెండ్ అయింది. ఇక త‌మిళంలో కార్తి పక్కన తీరన్ అధిగారం ఒండ్రు సినిమాలోనూ రకుల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇందులో రకుల్ కెరీర్ లో తొలిసారి పేద యువతి పాత్ర చేస్తుండటం విశేషం. ఈ సినిమా కోసం ప‌లుమార్లు చెన్నై వెళుతుంది. ఇలా ర‌కుల్ ప‌లు సినిమాల‌తో బిజీగా ఉండ‌గా, కేటాయించిన డేట్స్‌ ని బ‌ట్టి సౌత్ టూ నార్త్ చ‌క్క‌ర్లు కొడుతుంది.