భూ రికార్డుల ప్రక్షాళనతో రైతులకు న్యాయం

నిర్మల్ నియోజ‌క వ‌ర్గం ఎల్లప‌ల్లిలో భూ రికార్డుల ప్రక్షాళన మొదలైంది. గృహ నిర్మాణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి సమగ్ర భూ సర్వేను ప్రారంభించారు. రైతుల భూ వివాదాల పరిష్కారం కోసమే భూ సర్వేకు శ్రీకారం చుట్టామన్నారు మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి. రెవెన్యూ రికార్డుల ప్రక్షాళనతో అర్హులైన రైతులకు న్యాయం జరుగుతుందన్నారు. భూ రికార్డుల శుద్ధీకరణను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రతి గ్రామంలో 15 రో జులపాటు రెవెన్యూ అధికారులు ఇంటింటికీ తిరిగి సర్వే నిర్వహిస్తారని, భూ సమస్యలు ఉంటే వారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ క‌లెక్టర్ శివ లింగ‌య్య, ఇత‌ర అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.