భార‌త్‌కు కొత్త అంబాసిడ‌ర్‌

అమెరికా దేశాధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ భార‌త్‌కు కొత్త అంబాసిడ‌ర్‌ను నియ‌మించ‌నున్నారు. అమెరికా దౌత్య‌వేత్త పోస్టుకు కెన్న‌త్‌ జ‌స్ట‌ర్‌ను ట్రంప్ నియ‌మించిన‌ట్లు సమాచారం. భార‌త వ్య‌వ‌హారాల్లో కెన్నత్ నిపుణుడు. 62 ఏళ్ల కెన్న‌త్‌ను భార‌త అంబాసిడ‌ర్‌గా నియ‌మించాల‌ని భావిస్తున్న‌ట్లు గ‌త జూన్‌లో వైట్‌హౌజ్ వెల్ల‌డించింది. అంత‌ర్జాతీయ ఆర్థిక వ్య‌వ‌హారాల్లో ట్రంప్‌కు అసిస్టెంట్‌గా ఉన్నారు జ‌స్ట‌ర్‌. ఒక‌వేళ సేనేట్ అంగీక‌రిస్తే, రిచ‌ర్డ్ వ‌ర్మ స్థానంలో కెన్న‌త్ జ‌స్ట‌ర్‌ను నియ‌మిస్తారు. 45వ అధ్య‌క్షుడిగా ట్రంప్ బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌ర్వాత భార‌త అంబాసిడ‌ర్ పోస్ట్ ఖాళీగా ఉన్న‌ది.