భారత్- పాక్ సరిహద్దుల్లో కాల్పులు

భారత్- పాక్ సరిహద్దుల్లో మరోసారి పాక్ సైన్యం రెచ్చిపోయింది. ఆర్ ఎస్ పురా సెక్టార్ లోని ఆర్నియా ప్రాంతంలో పాక్ రేంజర్లు…కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ఒక బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ మరణించాడు. మరో వ్యక్తికి గాయాలయ్యాయి. అయితే పాక్ రేంజర్ల కాల్పులను భారత బలగాలు తిప్పికొడుతున్నాయి. ఇరు వర్గాల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. మరోవైపు కాల్పుల్లో మరణించిన బ్రిజేంద్ర బహదూర్ సింగ్ ఇంటి వద్ద  విషాదఛాయలు అలుముకున్నాయి.