భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంత్రి తుమ్మల పర్యటన

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలో మంత్రి తుమ్మల పర్యటించి మద్దిరాల తండా, ఎర్రాయిగూడెం, బోడు నుండి కొత్తగూడెం పోయే రహదారులపై వంతెనల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రాబోయే రెండు సంవత్సరాలలో ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలలో ఎటునుంచి ఎటుపోవడానికైనా రహదారులు వుండేలా ఈ వంతెనలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ వంతెనలకు సుమారు 11 కోట్ల రూపాయలను మంజూరు చేసినట్లు తెలిపారు. టేకులపల్లిలో వినాయకుడిని దర్శించుకున్న తుమ్మల, అనంతరం బోడు గ్రామంలోని 33 /11 కే‌వి విద్యుత్ ఉప కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్య క్రమంలో స్థానిక ఎమ్మెల్యే కోరం కనకయ్య, జెడ్‌పి‌టి‌సి లక్కినేని సురేందర్, జెడ్‌పి చైర్ పర్సన్ కవిత, గ్రంథాలయ కమిటీ ఛైర్మన్ దిండిగల రాజేందర్, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.