బుల్లెట్‌ రైలు ప్రాజెక్టుకు శంకుస్థాపన

దేశంలో తొలి బుల్లెట్‌ రైలు మార్గం నిర్మాణానికి  ప్రధాని మోడీ, జపాన్ ప్రధాని షింజో అబే శంకుస్థాపన చేశారు. ముంబై-అహ్మదాబాద్‌ మధ్య 508 కిలోమీటర్ల మేరకు ఈ రైలు మార్గాన్ని నిర్మించనున్నారు. గతేడాది నవంబర్‌ లో మోడీ జపాన్‌ పర్యటనలో భాగంగా బుల్లెట్‌ రైలు పథకానికి శ్రీకారం చుట్టారు. 2017లో బుల్లెట్‌ రైలు పథకానికి భూమిపూజ, 2018లో నిర్మాణ పనులు చేపట్టనున్నారు.