బిట్టుపల్లిలో శుద్ధజల కేంద్రం ప్రారంభం

పెద్దపల్లి జిల్లా బిట్టుపల్లిలో శుద్ధజల కేంద్రాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే పుట్ట మధు. బిట్టుపల్లిలో మంచినీటి కొరత ఎక్కువగా ఉండడంతో.. ఎన్టీపీసీ రామగుండం నిధులతో ప్రభుత్వం శుద్ధజల కేంద్రాన్ని నిర్మించింది. తాగునీరు అందించడంపై గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తూ.. ప్రభుత్వానికి, ఎమ్మెల్యే పుట్ట మధుకు కృతజ్ఞతలు తెలిపారు.