బాలయ్యతో నటాషా జోడీ!

నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించిన పైసా వ‌సూల్ చిత్రం సెప్టెంబ‌ర్ 1న విడుద‌ల కాగా, మంచి విజ‌యం సాధించింది. ఇప్పుడు అదే జోష్‌లో త‌న 102వ చిత్రాన్ని కేఎస్ ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్నాడు. సి. క‌ళ్యాణ్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రానికి జ‌య‌సింహ‌, రూల‌ర్ అనే టైటిల్స్ ప‌రిశీల‌న‌లో ఉన్నాయి. న‌య‌న‌తార క‌థానాయిక‌గా న‌టించ‌నున్న ఈ చిత్రంలో పంజాబ్ హీరో విల‌న్ గా క‌నిపించ‌నున్నాడు. ప్ర‌స్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటున్న‌ ఈ చిత్రం తమిళనాడులోని కుంభకోణంలో ఆ తరువాత వైజాగ్, హైదరాబాద్ లో షూటింగ్ జ‌రుపుకోనుంది . అయితే ఈ చిత్ర క‌థ‌కి అనుగుణంగా ముగ్గురు హీరోయిన్స్ కావ‌ల‌సి ఉండ‌గా, న‌య‌న‌తారని ఓ హీరోయిన్‌గా ఎంపిక చేయ‌గా, మల‌యాళ బ్యూటీ న‌టాషా దోషిని సెకండ్ హీరోయిన్‌గా సెల‌క్ట్ చేసిన‌ట్టు స‌మాచారం. మలయాళంలో ‘హైడ్ అండ్ సీక్, నయన, కాల్ మీ @’ చిత్రాల‌లో న‌టించి న‌టాషా మంచి పేరు తెచ్చుకుంది. త్వ‌ర‌లోనే న‌టాషా టీంతో క‌ల‌వ‌నున్నట్టు తెలుస్తుంది. ఇక మూడో హీరోయిన్ ఎవ‌ర‌నే దానిపై క్లారిటీ లేదు. సంక్రాంతికి బాల‌య్య 102 మూవీని విడుద‌ల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.