బస్సు-టిప్పర్ ఢీ, ఇద్దరు మృతి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం మద్దుకూరు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు-టిప్పర్ ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.