బన్సీలాల్ పేట వాసులకు పొజిషన్ సర్టిఫికెట్లు

దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో అద్భుత పాలన కొనసాగుతోందన్నారు పశు సంవర్థక, సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. పేదలందరికీ సొంత ఇండ్లు నిర్మించి ఇవ్వాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశ్యమన్నారు. నిరుపేదలు ఆత్మగౌరవంతో జీవించాలనే ఆలోచనతోనే సీఎం కేసీఆర్ డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించి ఇస్తున్నారని చెప్పారు. దసరా పండుగ సందర్భంగా హైదరాబాద్ సనత్ నగర్ డివిజన్ లోని బన్సీలాల్ పేటలో లబ్ధిదారులకు మంత్రి తలసాని డబుల్ బెడ్ రూం ఇండ్ల పొజిషన్ సర్టిఫికెట్ లను అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ హేమలత, పలువురు నాయకులు పాల్గొన్నారు.