ఫ్లొరిడా తీరాన్ని తాకిన ఇర్మా తుఫాన్

కరీబియన్‌ దీవులను అతలాకుతలం చేసిన ఇర్మా తుఫాన్‌… ఫ్లొరిడా తీరాన్ని తాకింది. దీని ప్రభావంతో గంటకు 127 కిలో మీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీస్తున్నాయి. ఈ గాలుల ధాటికి ఇండ్ల పైకప్పులు, రోడ్లమీద పార్క్‌ చేసిన ద్విచక్ర వాహనాలు.. కదిలిపోతున్నాయి. తీర ప్రాంతంలో కెరటాలు 8 నుంచి 12 అడుగులు ఎత్తులో విరుచుకుపడుతున్నాయి.  దక్షిణ ఆగ్నేయ దిశగా కదులుతూ.. కీవెస్ట్‌ సిటీకి 70 మైళ్ల దూరంలో ఉన్నట్లు గుర్తించింది. మరికొన్ని గంటల్లో ఫ్లోరిడా తీరాన్ని దాటే అవకాశం ఉందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఇప్పటికే లక్షల మంది సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దాదాపు 60 లక్షల మందిని ఇండ్లను ఖాళీ చేయాల్సిందిగా హెచ్చరిస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్  కోసం 15 వందల డాలర్లను మంజూరు చేస్తూ ట్రంప్  ఉత్తర్వులు ఇచ్చారు