ఫుట్‌సాల్ లీగ్‌లోకి సన్నీ ఎంట్రీ!

బాలీవుడ్ తార సన్నీ లియోన్.. క్రీడల్లోకి అడుగుపెట్టింది. ప్రీమియర్ ఫుట్‌సాల్ టోర్నీకి సంబంధించిన కేరళ కోబ్రాస్ ఫ్రాంచైజీని తీసుకున్నారు. కొచ్చి కేంద్రంగా ఇది పని చేస్తుందని ఫుట్‌సాల్ నిర్వాహకులు వెల్లడించారు. ఈ జట్టుకు ఆమెనే ప్రచారకర్తగా వ్యవహరిస్తారని తెలిపింది. ప్రీమియర్ ఫుట్‌సాల్ రెండో సీజన్ ఈనెల 15 నుంచి 17 వరకు ముంబైలోని ఎన్‌ఎస్‌సీఐ, వర్లీలో జరుగుతాయి. రెండోరౌండ్ మ్యాచ్‌లు ఈనెల 19 నుంచి 24 వరకు బెంగళూరులో నిర్వహించనున్నారు. ఇక సెమీస్, ఫైనల్స్ ఈనెల 26 నుంచి అక్టోబర్ 1 వరకు దుబాయ్‌లో జరుగుతాయి.