ప‌రిణీతి, పాండ్యా ప్రేమ ముచ్చట!

న‌టీమ‌ణుల‌కు, క్రికెట‌ర్స్ మధ్య ప్రేమ పుట్టడం కామ‌న్‌గా మారింది. ఇప్పటికే ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ భామ అనుష్క శ‌ర్మ‌ల మ‌ధ్య ప్రేమాయ‌ణం న‌డుస్తుంది. ఇప్పుడు ఇదే క్ర‌మంలో గ్లామ‌ర్ బ్యూటీ ప‌రిణితీ చోప్రా, ఇండియ‌న్ ఆల్‌రౌండ‌ర్ హార్ధిక్ పాండ్యాల మ‌ధ్య ప్రేమ పుట్టిందా? అనే అనుమానం అభిమానుల‌లో క‌లిగింది. మ‌రి ఇందుకు కార‌ణం లేక‌పోలేదు.  పరిణితీ చోప్రా తాజాగా త‌న ట్విట్ట‌ర్‌లో సైకిల్ ఫోటోని పోస్ట్ చేసి దానికి ‘అద్భుతమైన భాగస్వామితో కచ్చితమైన ప్రయాణం. ప్రేమ ఇప్పుడు గాలిలో తేలియాడుతోంది’ అంటూ కామెంట్ పెట్టింది. పరిణితీ చోప్రా పోస్ట్‌కి హార్ధిక్‌.. ‘పరిణీతి.. అది నేను ఊహించవచ్చా? నాకు తెలిసి ఇది బాలీవుడ్‌-క్రికెట్‌ లింక్‌ అయి ఉంటుంది. ఏదేమైనా మంచి ఫొటో’ అని ట్వీట్‌ చేశాడు. దీనికి స‌మాధానంగా ప‌రిణితీ .. కాస్త న‌వ్వుతూ, కావొచ్చు. కాకపోవచ్చు. మొత్తానికి నేను చెప్పేది ఏమిటంటే ఆ ఫొటోలోనే క్లూ ఉంది’ అని పేర్కొంది. వీరిద్ద‌రి మ‌ధ్య జ‌రిగిన ఈ క‌న్వ‌ర్జేష‌న్ అభిమానుల‌లో అనేక అనుమానాలు క‌లిగించింది. వెంటనే సోష‌ల్ మీడియాలో ఇద్ద‌రి మధ్య ప్రేమ న‌డుస్తుంద‌ని వార్త‌లు వైర‌ల్‌గా మారాయి. ఈ నేప‌థ్యంలో ప‌రిణితీ చోప్రా ఓ వీడియో పోస్ట్ చేసి పుకార్లకు చెక్ పెట్టింది. నేను చెప్పిన నా భాగ‌స్వామి నా కొత్త సెల్‌ఫోన్ అని ఈ అమ్మ‌డు వీడియో ద్వారా తెలిపింది. ఆ ఫోన్‌తో ఫోటో తీస్తే ఇంత అద్భుతంగా వ‌చ్చింద‌ని, అందుకే అది న‌న్ను ఎంతగానో ఆక‌ట్టుకుంద‌ని చెప్పింది. ఇంత‌లోనే మా ఇద్ద‌రి మ‌ధ్య ప్రేమ ఉంద‌ని వార్త‌లు రావ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగించిందని ప‌రిణితీ చెప్పుకొచ్చింది.