ప్రొకబడ్డీ మ్యాచ్ చూసిన అమిత్ షా

నిత్యం బిజీగా ఉండే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా  తెలుగు టైటాన్స్‌-పట్నా పరేట్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌ను ప్రత్యక్షంగా తిలకించారు. రాంచీ స్టేడియం గ్యాలరీ నుంచి మ్యాచ్‌ వీక్షించిన ఆయన క్రీడాకారులను ప్రోత్సాహపరిచారు. ఈ మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్‌ 30-46 తేడాతో ఓడిపోయింది. ఇప్పటి వరకు 16మ్యాచ్‌లు ఆడిన టైటాన్స్‌ 11 ఓటములతో టోర్నీ నుంచి నిష్క్రమించే దశకు చేరుకుంది. తెలుగు టైటాన్స్‌ తన తదుపరి మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్‌ను ఢీకొట్టనుంది. ప్రొకబడ్డీ 5వ సీజన్‌ పోటీలు రాంచీలో జరుగుతున్నాయి.