ప్రీక్వార్టర్స్‌కు పెట్రా క్విటోవా

యూఎస్ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌లో మాజీ నంబర్‌వన్ పెట్రా క్విటోవా జోరు కొనసాగుతున్నది. ఈ చెక్ రిపబ్లిక్ స్టార్ వరుసగా మూడోమ్యాచ్‌ను గెలుపొంది ప్రీక్వార్టర్స్ చేరింది. మూడోరౌండ్లో క్విటోవా 6-0, 6-4తో 18వ సీడ్ కరోలినా గార్సియా (ఫ్రాన్స్)పై గెలిచింది. జపాన్ క్రీడాకారిణి కురుమి నారా 6-3, 3-6, 6-3తో మాజీ చాంపియన్ కుజ్నెత్సోవాకు షాకిచ్చి మూడోరౌండ్ చేరగా, లోకల్ స్టార్ కొకొ వాండెవెగె 7-6(6), 6-2తో ఓన్స్ జేబర్‌పై , 10వ సీడ్ రద్వాన్‌స్కా 7-5, 6-2తో యులియా పుతిన్‌త్సెవాపై గెలిచి మూడోరౌండ్ చేరారు.