ప్రశాంతంగా కొనసాగుతున్న నిమజ్జనం

గణేశ్‌ నిమజ్జనం ప్రశాంతంగా కొనసాగుతున్నదని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్‌ రెడ్డి తెలిపారు. బాలాపూర్‌ నుంచి ట్యాంక్‌ బండ్‌ వరకు శోభాయాత్ర కొనసాగుతోందన్నారు. ఇప్పటికే  ఖైరతాబాద్‌ మహాగణపతి నిమజ్జనం పూర్తయ్యిందని..  అనుకున్న సమయానికే గణపతుల నిమజ్జనం పూర్తవుతుందని తెలిపారు. హైదరాబాద్‌ లో 12వేల విగ్రహాలకు జియో ట్యాగింగ్‌ చేశామని చెప్పారు. ఎప్పటికప్పుడు విగ్రహాలు ఎక్కడ ఉన్నది తెలిసిపోతుందని ఆయన అన్నారు. రేపు ఉదయం కల్లా నిమజ్జనం ప్రక్రియ పూర్తవుతుందని సీపీ వివరించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దనరెడ్డితో కలిసి ఆయన మీడియాకు వివరాలు వెల్లడించారు.