ప్రపంచానికి తెలంగాణ దారి చూపుతుంది

రైతు సమితుల ఏర్పాటుతో ప్రపంచానికి తెలంగాణ దారి చూపడం ఖాయమని ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. అసంఘటితంగా ఉన్న రైతులను సంఘటిత పరిచేందుకు ప్రపంచంలో, దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు సమితిల ఏర్పాటు జరుగుతోందని చెప్పారు.  హైదరాబాద్ లోని టిఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

ప్రపంచంలోనే తొలిసారిగా సీఎం కేసీఆర్ రైతులను సంఘటితం చేసి, రైతే రాజు అన్నది ఆచరణలో చూపుతున్నారని పల్లా అన్నారు. రైతాంగ సంక్షేమం కోసమే సమన్వయ సమితిల ఏర్పాటు తప్ప.. విపక్షాలు ఆరోపించినట్టు తగాదాలు సృష్టించడానికి కాదని స్పష్టం చేశారు. రైతు సమితిల ఏర్పాటుపై సంతోషంగా లేనిది విపక్ష నేతలు, భూకబ్జాదారులేనని వ్యాఖ్యానించారు. రైతు సమితిల ఏర్పాటుతో ప్రపంచానికి తెలంగాణ దారి చూపడం ఖాయమని పల్లా చెప్పారు.