ప్రధాని మోడీ టీచర్స్ డే శుభాకాంక్షలు

భారత మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని జరుపుకునే ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ ఉపాధ్యాయులకు టీచర్స్‌డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణన్‌కు ప్రధాని ఘనంగా నివాళులర్పించారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ గొప్ప ఉపాధ్యాయుడని, దేశ విద్యావ్యవస్థలో మార్పులు తీసుకురావడానికి ఆయన ఎనలేని కృషి చేశారని ప్రధాని మోడీ తెలిపారు.  నవ భారత నిర్మాణ కలను సాకారం చేయడంలో ఉపాధ్యాయులదే కీలక పాత్ర అని ప్రధాని ట్వీట్ చేశారు. ఉపాధ్యాయుల ఆవిష్కరణల ఫలితంగానే నవ భారతం సాధ్యపడుతుందని ప్రధాని చెప్పారు. మన్ కీ బాత్‌లో ఉపాధ్యాయులనుద్దేశించి చేసిన ప్రసంగాన్ని ప్రధాని ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకున్నారు.