ప్రద్యుమ్న కేసు సీబీఐకి!

గురుగ్రాంలోని స్కూల్లో హత్యకు గురైన ఏడేళ్ల బాలుడు ప్రద్యుమ్న కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్లు చెప్పారు హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్. ప్రద్యుమ్నఇంటికి వెళ్లి… అతని కుటుంబ సభ్యులను పరామర్శించిన ఆయన… దోషులకు శిక్ష పడేలా చూస్తామన్నారు. ప్రద్యుమ్న హత్యకు గురైన ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్ ను ప్రభుత్వమే స్వాధీనం చేసుకొని, మూడు నెలల పాటు నిర్వహిస్తుందన్నారు. ఈ ఘటన జరగడం బాధాకరమని, ఇలాంటి చర్యలను ఖండిస్తున్నట్లు చెప్పారు.