ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ పూజలు

హైదరాబాద్ ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ కుటుంబం దసరా పండుగ ఘనంగా జరుపుకుంటున్నారు. విజయదశమి సందర్భంగా ప్రగతి భవన్ ప్రాంగణంలోని అమ్మవారి ఆలయంలో వారు ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత వాహన పూజ, ఆయుధ పూజ నిర్వహించారు. సీఎం కేసీఆర్, ఆయన సతీమణి శోభ, మంత్రి కేటీఆర్, ఆయన సతీమణి, టి న్యూస్ ఎండీ సంతోష్ కుమార్ పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భద్రతా సిబ్బంది, ప్రగతి భవన్ సిబ్బందికి సీఎం కేసీఆర్ దసరా శుభాకాంక్షలు చెప్పారు.