పొంగిపొర్లుతున్న నాచారం నాలా

హైదరాబాద్ లో అర్ధరాత్రి నుంచి కుంభవృష్టి కురుస్తున్నది. అర్ధ‌రాత్రి నుంచి ఇవాళ ఉద‌యం వ‌ర‌కు న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో కుండ‌పోత వ‌ర్షం పడుతున్నది దీంతో న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాలు, రోడ్లు జ‌ల‌మ‌య‌మ‌య్యాయి. ఇక.. భారీ వ‌ర్ష‌పు నీటితో నాచారం నాలా పొంగి ప్ర‌వ‌హిస్తున్న‌ది. దీంతో నాలా నీళ్లు రోడ్డు మీదికి వ‌చ్చి ప్ర‌వ‌హిస్తుండ‌టంతో నాచారం రోడ్లు చెరువుల‌ను త‌ల‌పిస్తున్నాయి. వ‌ర‌ద నీటిలో నాచారంలో పలు వాహనాలు చిక్కుకున్నాయి.