పెరిగిన గ్యాస్ ధరలు

గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర‌లు పెరిగాయి. స‌బ్సిడీ గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర రూ.7 పెరిగింది. దీంతో స‌బ్సిడీ తో వ‌చ్చే గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర ఇప్పుడు ఢిల్లీలో రూ. 487.18 గా ఉండ‌నుంది. నాన్ స‌బ్సిడీ సిలిండ‌ర్ ధ‌ర రూ. 73. 5 పెరగ‌డంతో దాని ధ‌ర రూ. 597.50 గా ఉండ‌నుంది. అటు  ప్ర‌తి సిలిండ‌ర్ పై నెల‌కు 4 రూపాయ‌ల చొప్పున పెంచుతూ ఈ ఆర్థిక సంవ‌త్స‌రం ముగిసే లోపు స‌బ్సిడీని ఎత్తేయాల‌ని ప్ర‌భుత్వాన్ని చ‌మురు కంపెనీలు కోరాయి.