పెద్దనోట్ల రద్దు తర్వాత నగదు వినియోగం తగ్గింది

ఎన్డీయే సర్కారు ప్రవేశ పెట్టిన జన్ ధన్ యోజన స్కీమ్ లో దాదాపు 30 కోట్ల కుటుంబాలు బ్యాంక్ అకౌంట్లు తీసుకున్నాయన్నారు కేంద్ర ఆర్ధిక మంత్రి జైట్లీ. ఈ స్కీమ్ ప్రవేశ పెట్టకముందు….దేశవ్యాప్తంగా 42 శాతం కుటుంబాలకు మాత్రమే బ్యాంకు అకౌంట్లు ఉండేవని, ప్రస్తుతం 99.99 శాతం కుటుంబాలకు ఏదో ఒక బ్యాంకులో అకౌంట్ ఉందన్నారు. ఇక ఆధార్ సామర్ధ్యాన్ని యూపీఏ ప్రభుత్వం అంచనా వేయలేకపోయిందన్నారు జైట్లీ. అందుకే సరైన చట్టాన్ని చేయలేదన్నారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత నగదు వినియోగం తగ్గిందని, పన్ను చెల్లించే వారి సంఖ్య పెరిగిందని జైట్లీ అన్నారు. ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఫైనాన్షియల్ ఇంక్లూజన్ సదస్సులో ఆయన మాట్లాడారు.