పెద్దమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ పెద్దమ్మ ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచి భారీగా తరలి వచ్చి అమ్మవారికి మొక్కులు తీర్చుకుంటున్నారు. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు.