పినపాక నియోజకవర్గంలో మంత్రి తుమ్మల పర్యటన

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక అసెంబ్లీ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అశ్వాపురం మండలం గొందిగూడెం ప్రాంతంలో రూ.కోటి 50 లక్షల ఖర్చుతో నిర్మించనున్న బీటీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మిట్టగూడెంలో నిర్మించిన 40 డబుల్ బెడ్ రూం ఇళ్లను ప్రారంభించారు. మిట్టగూడెంలోని రథం గుట్టపై మిషన్ భగీరథ పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. మణుగూరు ప్రధాన రహదారిలో ఉన్న కోడిపుంజుల వాగుపై రూ.4 కోట్ల ఖర్చుతో నిర్మించనున్న బ్రిడ్జి పనులకు శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం, కేటాయింపుల్లో అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని మంత్రి తుమ్మల హెచ్చరించారు.

ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, తదితరులు పాల్గొన్నారు.