పాపం పూజా.. ఎన్ని తిప్పలో!

‘‘భాష నేర్చుకోవడం సులభమా? కష్టమా? నేర్చుకున్న భాషను సాధన చేయాలా? చేయకపోతే మర్చితామా? కొత్త భాషను నేర్చుకునేవారికి ఇన్నిరకాల అనుమానాలూ ఉంటాయి. నేను కూడా అందుకు మినహాయింపు కాదు’’ అంటుంది హీరోయిన్ పూజా హెగ్డే. ఆమె ఇటీవల ‘డీజే దువ్వాడ జగన్నాథమ్‌’ చిత్రంలో నటించింది. అంతకుముందు ‘ఒక లైలా కోసం’, ‘ముకుంద’ చిత్రాలతో యాక్ట్ చేసింది. ఈ చిత్రాల్లో నటిస్తున్న సమయంలో పూజా తెలుగు నేర్చుకునే ప్రయత్నం చేసిందట. ఆ అనుభవాలను గురించి ప్రస్తావిస్తూ ‘‘ఉదయం లేచినప్పటి నుంచీ చుట్టుపక్కల ఉన్న వారు తెలుగులో మాట్లాడుతుంటే నాకు తెలుగు వచ్చేసినట్టే భావించాను. కొన్ని పదాలను నేర్చుకున్నానన్న సంతృప్తి కూడా ఉండేది. కానీ ముంబైకి వెళ్లాక నాతో తెలుగు మాట్లాడేవారు లేరు. దాంతో నేర్చుకున్న కొన్ని పదాలు మర్చిపోయాను. మళ్లీ తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నిస్తాను’’ అని పూజా తెలిపింది.