పవన్ .. కీర్తి సురేశ్ లపై పాట చిత్రీకరణకు రంగం సిద్ధం!

పవన్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్నది. హైదరాబాద్ లో 40 శాతం చిత్రీకరణను జరిపిన సినిమా టీమ్, తదుపరి షెడ్యూల్ ను బ్యాంకాక్ లో ప్లాన్ చేశారు. ఇప్పుడు సినిమా టీమ్ అక్కడికి చేరుకుంది. రేపటి నుంచి తాజా షెడ్యూల్ మొదలుకానుంది. వారం రోజుల పాటు జరిగే షూటింగులో, పవన్ .. కీర్తి సురేశ్ లపై ఒక పాటతో పాటు కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.
పవన్ సరసన మరో కథానాయికగా అనూ ఇమ్మాన్యుయేల్ నటిస్తోంది. ఖుష్బూ .. బొమన్ ఇరాని ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు. సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. ఇటు కీర్తి సురేశ్ .. అటు అనూ ఇమ్మాన్యుయేల్ ఇద్దరూ కూడా, సినిమా తమ కెరియర్ కి ఎంతో హెల్ప్ అవుతుందని భావిస్తున్నారు. వాళ్ల నమ్మకాన్ని సినిమా నిలబెడుతుందేమో చూడాలి