పర్యావరణ పరిస్థితులను అదుపు చేయాలి

ప్రపంచ వ్యాప్తంగా ప్రమాదకరంగా మారిన వాతావారణ పరిస్థితులను అదుపు చేసేందుకు అన్ని దేశాలు కృషి చేయాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. బ్రిక్స్ సమావేశాల్లో భాగంగా చైనాలో షామన్‌ నగరంలో ఎమర్జెంగ్‌ మార్కెట్స్‌ అండ్ డెవలపింగ్ కంట్రీస్‌ అనే అంశంపై జరిగిన చర్చలో మోడీ మాట్లాడారు. పర్యావరణ పరిస్థితులే కాకుండా టెర్రరిజం, సైబర్‌ క్రైమ్‌ లు కూడా ప్రపంచానికి సవాల్ గా మారాయి.  దీనిపై దృష్టి పెట్టాల్సిన అవసరముందని ప్రధాని చెప్పారు. ఇక భారత్‌ లో తమ ప్రభుత్వం సబ్‌ కా సాథ్‌ సబ్‌ కా వికాస్ పేరిట అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తుందని మోడీ ఈ సందర్భంగా తెలిపారు.