పట్టాలు తప్పిన శక్తికుంజ్ ఎక్స్‌ప్రెస్

ఉత్తర ప్రదేశ్ లో మరో రైలు పట్టాలు తప్పింది. హౌరా- జబల్ పూర్ మధ్య నడిచే శక్తి కుంజ్ ఎక్స్ ప్రెస్.. సోన్ బాంద్రా వద్ద ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఏడు బోగీలు పట్టాలు తప్పగా.. ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.  పట్టా విరిగిపోవడంతోఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు గుర్తించారు. అయితే ఇటీవల యూపీలో వరుస రైలు ప్రమాదాలు జరుగుతుండటంతో.. ఈ ప్రమాదం వెనుక ఏదైనా కుట్ర ఉందా? అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వరుస ప్రమాదాలకు బాధ్యత వహిస్తూ…సురేష్ ప్రభు బాధ్యతల నుంచి తప్పుకుని వారం కూడా గడవక ముందే ఈ ఘటన చోటు చేసుకుంది.  ఘటనపై మంత్రి పీయూష్ గోయల్‌ కు పూర్త సమాచారం అందించామని రైల్వే పీఆర్వో తెలిపారు. ఉదయం 6.25 సమయంలో ఘటన చోటు చేసుకుందని, మిగతా బోగీల్లో ప్రయాణికులను తరలించినట్లు ఆయన తెలిపారు.