న్యూక్లియర్‌ సూపర్‌ బాంబ్‌ ను పరీక్షించిన అమెరికా

నార్త్  కొరియా రెచ్చగొట్టే చర్యలతో అమెరికా సైతం అప్రమత్తమైంది. కిమ్  జాంగ్‌  దిమ్మ తిరిగేలా న్యూక్లియర్‌  సూపర్‌  బాంబ్‌  ను పరీక్షించినట్లు ప్రకటించింది. నార్త్  కొరియాను కంట్రోల్  చేసేందుకు అమెరికా ఈ బాంబ్‌  ను ప్రయోగించినట్లు తెలుస్తోంది. అటు అమెరికా నేవీ కూడా ఓ బాలిస్టిక్‌  క్షిపణిని పరీక్షించింది. హవాయిలో ఈ పరీక్షలు నిర్వహించినట్లు పసిఫిక్‌  మిస్సైల్‌  రేంజ్‌  ఫెసిలిటీ ఓ ప్రకటనలో తెలిపింది. తాము పరీక్షించిన బీ 61-12 బాంబును కిమ్‌  ను అడ్డుకోవడానికి ఉపయోగపడుతుందని అమెరికా భావిస్తోంది.