నేడు ముంబై పేలుళ్ల దోషులకు శిక్ష ఖరారు

ముంబై పేలుళ్ల కేసులో దోషులకు ఇవాళ శిక్ష ఖరారు చేయనుంది సీబీఐ ప్రత్యేక న్యాయ స్థానం.1993 ముంబై పేలుళ్ల కేసులో ఐదుగురు దోషులుగా తేలారు. వీరిలో  అబూసలేంతో పాటూ మరో నలుగురున్నారు. ఈ కేసులో సుధీర్ఘ విచారణ జరిపిన కోర్టు జూన్ లో ఆరుగురిని దోషులుగా తేల్చింది. 1993 మార్చ్ 12 న ముంబైలో జరిగిన వరుస పేలుళ్లలో  257 మంది మరణించారు. 713 మంది తీవ్రంగా గాయపడ్డారు.  కోట్ల రూపాయల్లో ఆస్తి నష్టం జరిగింది. ఈ కేసులో రెండు దఫాలుగా విచారణ జరిపిన  కోర్టు…తొలి దశ విచారణను 2007లో పూర్తి చేసింది. నాటి విచారణలో యాకూబ్ మెమన్ కు ఉరి శిక్ష, సంజయ్ దత్ కు జైలు శిక్ష విధించింది. వాటి అమలు కూడా జరిగిపోయింది. కీలకమైన ఈ కేసులో తీర్పు నేపథ్యంలో ముంబైలోని సున్నితమైన ప్రాంతాల్లో భద్రత ఏర్పాటు చేశారు.