నెస్ కేఫే అంబాసిడ‌ర్ గా అదా

హార్ట్ ఎటాక్ తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఆదాశ‌ర్మ ఆ త‌ర్వాత క్ష‌ణం, సన్ ఆఫ్ సత్యమూర్తి, సుబ్రహ్మణ్యం ఫర్ సెల్ మూవీల్లో న‌టించింది.. క్షణం సినిమాలో నటనతో ఆకట్టుకున్నా అదా శర్మ కి టాలీవుడ్ లో మాత్రం పెద్దగా ఛాన్సులు రాలేవు. అయితే బాలీవుడ్ కామాండో సినిమాలో మాత్రం హీరోయిన్ గా ఛాన్స్ ల‌భించినా ఆ మూవీ ప్లాప్ కావ‌డంతో అమెకు చేతిలో మూవీలు లేకుండా పోయాయి. అనూహ్యంగా నెస్కేఫ్ లాంటి బ్రాండ్ కాఫీ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా సెలెక్ట్ అయ్యింది. ఇలాంటి బ్రాండెడ్ కంపెనీలో బాగమైనందుకు ఎంతో సంతోషంగా ఉందని. తప్పకుండా ఈ లుక్ లో మీకు నచ్చుతనని చెబుతూ.. మొదటి సారి ఇలాంటి కమర్షియల్ యాడ్ లో కనిపించబోతున్నానని చెప్పింది. అలాగే ఈ యాడ్ లో తనే తెలుగు,మలయాళం డబ్బింగ్ చెబుతున్నా అని వివరించింది.