నువ్ నాకు చెప్పు.. నేను నీకు చెప్తా!

యంగ్ డైరెక్ట‌ర్ సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌భాస్‌, శ్ర‌ద్ధా క‌పూర్ ప్ర‌ధాన పాత్ర‌లుగా సాహో అనే సినిమా తెరకెక్కుతున్నది. వ‌చ్చే ఏడాది విడుద‌ల కానున్న ఈ చిత్రం భారీ బ‌డ్జెట్‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతుంది. చిత్ర హీరో ప్ర‌భాస్ ఇప్ప‌టికే టీంతో జాయిన్ కాగా, శ్ర‌ద్దా అతి త్వ‌ర‌లోనే షూటింగ్‌లో పాల్గొన‌నుంది. అయితే ప్ర‌స్తుతం ఫోన్ ట‌చ్‌లో ఉన్నశ్ర‌ద్ధా క‌పూర్‌, ప్ర‌భాస్‌లు ఒక‌రికొక‌రు సాయం చేసుకోవాల‌ని భావిస్తున్నార‌ట‌. సాహో చిత్రాన్ని నేష‌న‌ల్ రేంజ్‌లో హిందీ, తెలుగు, త‌మిళ భాష‌ల‌లో ఒకేసారి తెర‌కెక్కిస్తున్నారు. వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఈ సినిమాకి మంచి ఆద‌ర‌ణ ల‌భించేందుకు ప‌ర‌భాషా న‌టులని కూడా తీసుకున్నారు. అయితే సాహో చిత్రంతో తొలిసారి తెలుగులోకి ఎంట్రీ ఇవ్వ‌డంతో పాటు త‌న‌ పాత్ర‌కి తానే తెలుగులో సొంతంగా డైలాగులు చెప్పుకోవాల‌ని అనుకుంటుంద‌ట శ్ర‌ద్ధా. అలానే ప్రభాస్ కూడా హిందీలో సొంతంగా డ‌బ్బింగ్ చెప్పాల‌ని భావిస్తున్న‌ట్టు స‌మాచారం. ఈ క్ర‌మంలో ఇద్ద‌రు ఒక‌రికొక‌రు సాయం తీసుకోవాల‌ని అనుకున్నార‌ట‌. ప్ర‌భాస్‌కి హిందీ డైలాగులు చెప్పే విషయంలో శ్రద్ధ సాయపడితే, శ్రద్ధకి తెలుగు డైలాగుల విషయంలో ప్రభాస్‌ సాయం చేయ‌డం అనే అంశం అభిమానుల‌కి చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. సాహో చిత్రంలో నీల్ నితిన్ ముఖేష్, చుంకీ పాండే, జాకీ ష్రాఫ్, టిన్ను ఆనంద్, మందిరా బేడీలు ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్న‌ట్టు తెలుస్తుంది.