నీతి ఆయోగ్‌ వైస్‌ ఛైర్మన్‌గా రాజీవ్‌ కుమార్‌

నీతి ఆయోగ్‌ వైస్‌ ఛైర్మన్‌గా ప్రముఖ ఆర్థికవేత్త రాజీవ్‌ కుమార్‌ బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు ఈ పదవిలో ఉన్న భారత-అమెరికన్‌ ఆర్థికవేత్త అరవింద్‌ పనగారియా తిరిగి తన అధ్యాపక వృత్తిలోకి వెళ్లిపోవడంతో రాజీవ్‌ను ఆ పదవిలో నియమించారు. సెంటర్‌ ఫర్‌ పాలసీ రీసెర్చ్‌లో సీనియర్‌ ఫెలోగా రాజీవ్‌ కుమార్‌ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.