నీట్ కు వ్యతిరేకంగా కొనసాగుతున్న నిరసనలు

నీట్ లో క్వాలిఫై కాలేదని ఆత్మహత్యకు పాల్పడ్డ చెన్నైకి చెందిన అనిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ తమిళనాడులో ఆందోళనలు మిన్నంటాయి. కాలేజ్‌ విద్యార్థులు, పలు రాజకీయ పార్టీలకు చెందిన కార్యకర్తలు చెన్నైలోని పలు ప్రాంతాల్లో వరుసగా నాలుగో రోజూ ఆందోళనలు చేపట్టారు. నీట్ ను రద్దు చేయాలని, విద్యార్ధుల భవిష్యత్ తో ప్రభుత్వం ఆడుకోవద్దంటూ నినాదాలు చేశారు. ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం ప్రకటించిన ఎక్స్ గ్రేషియాను అనిత కుటుంబ సభ్యులు తిరస్కరించారు. మరోవైపు, పుదుచ్చేరిలో కూడా నీట్ కు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి.