నిర్లక్ష్యం ఖరీదు.. 22 మంది మృతి

ముంబై తొక్కిసలాట ఘటనలో రైల్వే అధికారుల నిర్లక్ష్యం కళ్లకుగట్టినట్లు కన్పిస్తోంది. వర్షం కారణంగా చూపి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నా.. నిజాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఎల్ఫిన్ స్టోన్  బ్రిడ్జీ నిర్మాణ మరమ్మత్తుల కోసం 12 కోట్ల రుపాయల నిధులకు అనుమతి లభించగా… అధికారులు కేవలం వెయ్యి రుపాయాలు మాత్రమే కేటాయించారు. సురేష్  ప్రభు రైల్వే మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కొద్ది రోజులకే ఈ నిధులను సాంక్షన్‌  చేశారు. ఫండ్స్‌ ఉన్నా కూడా.. అధికారులు బ్రిడ్జీని మరమ్మత్తు చేసేందుకు ముందుకు రాలేదు. ఇదే విషయాన్ని కాగ్  తన రిపోర్టులో పేర్కొన్నా.. రైల్వే శాఖ సైతం లైట్  తీసుకుంది.