నిమజ్జనంపై హోంమంత్రి నాయిని సమీక్ష

హైదరాబాద్ లో గణేష్ నిమజ్జన ప్రక్రియ, ఊరేగింపులను హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పర్యవేక్షించారు. బషీర్ బాగ్ లోని పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి పరిశీలించారు. ఆయా ప్రదేశాల్లో పరిస్థితులను బట్టి వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్షించారు. ఏరియల్ సర్వే అనంతరం హోంమంత్రి ఈ సమీక్ష జరిపారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి, ఇతర పోలీస్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.