నిజామాబాద్ లో గిరిజన మహిళా డిగ్రీ కాలేజీ ప్రారంభం

ఆడపిల్లల అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందన్నారు నిజామాబాద్ ఎంపీ కవిత. నిజామాబాద్ గాయత్రి నగర్ లో గిరిజన మహిళ డిగ్రీ కళాశాలను ఆమె ప్రారంభించారు. ఆడపిల్లలు అన్ని రంగాల్లో ముందుండాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ పలు పథకాలు రూపొందించారని కవిత చెప్పారు. పెద్ద మొత్తంలో మహిళల అభివృద్ధి కోసం పథకాలు రూపొందించిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమేనన్నారు. ఒకప్పుడు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలంటేనే భయపడే జనం.. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు, హాస్పిటళ్లలో కల్పించిన మౌలిక సదుపాయాలతో ప్రస్తుతం ప్రభుత్వ హాస్పిటళ్లకు గర్భిణులు క్యూ కడుతున్నారని అన్నారు.