నిండుకుండలా వైరా రిజర్వాయర్

ఖమ్మం జిల్లాలోని వైరా రిజర్వాయర్‌ నిండుకుండలా మారింది. భారీ వర్షాలకు తోడు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో ప్రాజెక్టు పూర్తి స్థాయి మట్టానికి చేరుకుంది. ప్రాజెక్టు నిండటంతో అన్నదాతల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఈ ఏడాది పంటలకు సరిపడా సాగునీరు లభిస్తుందంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రిజర్వాయర్‌ నిండటంతో  పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు.