నాగచైతన్యతో మేఘా జోడీ!

యుధ్ధం శరణం తరువాత నాగచైతన్య వరుసగా రెండు చిత్రాలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు.  చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కనున్న సవ్యపాచి చిత్రంతో పాటు మారుతి రూపొందించనున్న సినిమా మరొకటి. ఈ రెండు చిత్రాల్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించనున్నారు. కాగా ఈ రెండు చిత్రాల్లో ముందు మారుతి చిత్రం పట్టాలెక్కనుందని తాజా సమాచారం. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమా త్వరలో సెట్స్‌పైకి రానుందని, ఇందులో కథానాయకగా లై ఫేమ్ మేఘా ఆకాష్‌ను ఖరారు చేయాలనే ఆలోచనలో వున్నట్లు తెలిసింది. మేఘా ఆకాష్ ప్రస్తుతం నితిన్ హీరోగా కృష్ణచైతన్య తెరకెక్కిస్తున్న చిత్రంలో నటిస్తున్నది.