నవాజ్ షరీఫ్ కు మరో ఎదురుదెబ్బ

పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కు మరో ఎదురు దెబ్బ తగిలింది. పనామా కేసులో పాక్ సుప్రీం కోర్టును ఆశ్రయించిన ఆయనకు…..అక్కడ కూడా చుక్కెదురైంది. ఆయన రివ్యూ పిటీషన్ ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. అంతేకాదు ఆయనపై వేసిన అనర్హత వేటును సుప్రీం కోర్టు సమర్ధించింది. పనామా స్కాం కేసులో అనర్హతకు గురై పదవి కోల్పోయిన నవాజ్ షరీఫ్….దాన్ని సవాల్ చేస్తూ…పాకిస్థాన్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.