నలుగురు మంత్రులకు కేబినెట్ హోదా  

కేంద్ర మంత్రివర్గ విస్తరణలో ప్రధాని మోడీ నలుగురు మంత్రులకు పదోన్నతి కల్పించారు.  సహాయ మంత్రులుగా పనిచేసిన నిర్మలా సీతారామన్‌, ధర్మేంద్ర ప్ర‌దాన్‌, పీయూష్‌ గోయల్‌, ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీలను కేబినెట్‌ మంత్రులుగా ప్రమాణం చేశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ వీరిచేత ప్రమాణస్వీకారం చేయించారు.

అటు తొమ్మిది మంది కొత్త వారికి  ప్రధాని మోడీ తన మంత్రివర్గంలో చోటు కల్పించారు.  అశ్వినికుమార్‌ చౌబే, గజేంద్ర సింగ్‌ షెకావత్‌, శివప్రతాప్‌ శుక్లా, హర్దీప్‌సింగ్‌పూరి, సత్యపాల్‌సింగ్‌, రాజ్‌కుమార్‌సింగ్‌, అల్ఫోన్స్‌ కన్నన్‌తనం, వీరేంద్రకుమార్‌, అనంత్‌కుమార్‌ హెగ్డే కొత్త మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. పార్టీ బలోపేతం, ఎన్నికల అంశాలపై బీజేపీ దృష్టిసారించే దిశగా ఈ మంత్రివర్గ కూర్పును చేసింది.