ధర్మపురిలో జాబ్ మేళా

నిరుద్యోగ యువత కోసం డిఆర్‌డీఏ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించడం అభినందనీయమన్నారు ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని సూచించారు. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ, ఎంప్లాయ్ మెంట్ జనరేషన్ & మార్కెటింగ్ మిషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చీఫ్‌ విప్‌ కొప్పుల, కలెక్టర్ శరత్ పాల్గొన్నారు. ఇందులో 29 కంపెనీలు పాల్గొన్నాయి. ఎంపికైన వారికి వెంటనే నియామక లేఖలు ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాలలోని నిరుపేద, నిరుద్యోగ యువతకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణనివ్వడంతోపాటు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు.