దేశ వ్యాప్తంగా ముస్లింల ప్రార్థనలు

బక్రీద్ సందర్భంగా దేశ వ్యాప్తంగా ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఢిల్లీలోని జమా మసీద్‌ వద్ద పెద్ద ఎత్తున ముస్లింలు ప్రత్యేకంగా ప్రేయర్స్ చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ పాల్గొన్నారు. అటు ముంబై, జమ్ముకశ్మీర్‌ సహా అన్ని రాష్ట్రాల్లో ప్రత్యేకంగా ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఒకరికొకరు బక్రీద్‌ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.