దీక్ష విరమించిన విద్యుత్ ఉద్యోగులు

రాష్ట్ర విద్యుత్ ఉద్యోగులు మూడు రోజులుగా చేస్తున్న దీక్షను విరమించారు.  ట్రాన్స్  కో-జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు ఉద్యోగులకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. విద్యుత్‌ ఉద్యోగులకు ఇచ్చిన పదోన్నతులను హైకోర్ట్ ఆదేశాలతో ఆయా సంస్థలు రద్దు చేశాయి. రద్దు చేసిన పదోన్నతులను పునరుద్ధరించాలని కోరుతూ విద్యుత్ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. దీంతో విద్యుత్‌ ఉద్యోగ సంఘాల నేతలతో ప్రభాకర్‌ రావు చర్చలు జరిపారు. కోర్టు ఆదేశాలను పాటించాల్సిన అనివార్య పరిస్థితుల్లోనే పదోన్నతులు రద్దు చేశామని.. ఉద్యోగులకు ఎలాగైనా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. సంతృప్తి చెందిన ఉద్యోగ సంఘాల నాయకులు దీక్ష విరమించారు.