త్వ‌ర‌లో ఖ‌మ్మం జిల్లాకు 24 గంట‌ల కరెంట్‌

మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు ఖ‌మ్మం జిల్లాలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఎర్రుపాలెంలో నూతనంగా నిర్మించిన రైల్వే ఓవ‌ర్ బ్రిడ్జిని ఆయ‌న ప్రారంభించారు. అనంత‌రం మీన‌వోలులో డీసీసీబీ బ్రాంచ్ ను మంత్రి ప్రారంభించారు. ఆ త‌ర్వాత మ‌ధిర‌లోని శివాల‌యం ద‌గ్గ‌ర విద్యుత్ స‌బ్ స్టేష‌న్ కు తుమ్మ‌ల శంకుస్థాప‌న చేశారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడిన తుమ్మల.. ఇప్ప‌టికే మూడు జిల్లాల్లో రైతుల‌కు 24 గంట‌ల క‌రెంట్ ఇస్తున్నామ‌న్నారు. త్వ‌ర‌లోనే ఖ‌మ్మం జిల్లాలో కూడా 24 గంట‌ల విద్యుత్ అందిస్తామ‌న్నారు. మ‌ధిర నియోజ‌క‌వ‌ర్గంలో 385 కిలోమీట‌ర్ల రోడ్ల నిర్మాణం కోసం రూ. 163 కోట్లు మంజూరు చేస్తామ‌ని ఈ సంద‌ర్భంగా మంత్రి తుమ్మ‌ల హామీ ఇచ్చారు.