త్వరలో రూ.100 నాణెం

తమిళనాడులోని ఏఐఏడీఎంకే పార్టీ వ్యవస్థాపకుడు డాక్టర్ ఎంజీ రామచంద్రన్, ప్రముఖ గాయకురాలు ఎంఎస్ సుబ్బలక్ష్మి శత జయంతి సందర్భంగా రూ.100 నాణెంను విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నది. రూ. 100 నాణెం ముఖభాగంలో డాక్టర్ ఎంజీ రామచంద్రన్ చిత్రం ఉంటుంది. నాణేనికి మరోవైపు అశోకచక్రం, దాని కింద 100 అని అంకెల రూపంలో కనిపిస్తుంది. అలాగే ఎంఎస్ సుబ్బలక్ష్మి చిత్రంతో రూ.100 స్మారక నాణెం విడుదల కానుంది. అంతేగాక, కొత్త డిజైన్ తో రూ.5, రూ.10 నాణెలను కూడా మార్కెట్‌లోకి తీసుకురావాలని కేంద్రం భావిస్తున్నది.