తొలి వన్డేకు ఫించ్ దూరం?

భారత్‌తో సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియాకు చే దువార్త. ప్రాక్టీస్‌లో భారీ హిట్టర్ ఆరోన్ ఫించ్ గాయపడ్డాడు. బ్యాటింగ్ ప్రాక్టీస్‌లో అతని కాలి పిక్కకు గాయమైందని ఆసీస్ మేనేజ్‌మెంట్ వెల్లడించింది. మిగతా ప్రాక్టీస్ సెషన్లకు దూరంగా ఉన్న అతను ఈనెల 17న జరిగే తొలి వన్డేలో ఆడటంపై సందిగ్దత కొనసాగుతున్నది. ఒకవేళ ఫించ్ అందుబాటులో లేకపోతే ట్రావిస్ హెడ్, హిల్టన్ కార్ట్‌రైట్‌లలో ఒకరికి అవకాశం దక్కనుంది. బ్యాటింగ్ లైనప్‌లో నాలుగోస్థానానికి హెడ్ సరిగ్గా సరిపోతాడని ఆసీస్ కోచ్ డేవిడ్ సాకేర్ చెప్పారు. మరోవైపు మిగతా ఆటగాళ్లు నెట్స్‌లో బాగా చెమటోడ్చారు. ముందుగా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసిన స్మిత్.. తర్వాత మ్యాక్స్‌వెల్, వార్నర్, స్టోయినిస్, హెడ్‌లతో కలిసి క్యాచ్‌లను ప్రాక్టీస్ చేశాడు. మిగతా వారు కూడా అతన్ని అనుసరించారు.