తొలిరోజే చుక్కలు చూపించిన లక్నో మెట్రో

ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలో కొత్తగా ప్రారంభించిన మెట్రో రైల్‌ సర్వీస్‌ తొలిరోజే ప్యాసింజర్లకు చుక్కలు చూపించింది. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ లక్నో మెట్రో రైల్‌ సర్వీస్‌ ను నిన్న ప్రారంభించగా… ఇవాళ సాంకేతిక సమస్య వల్ల ట్రైన్‌ మార్గమధ్యంలోనే నిలిచిపోయింది. ట్రైన్‌ లో కరెంటు సరఫరాకు అంతరాయం కలగడంతో లైట్లు, ఏసీ పనిచేయలేదు. దీంతో ప్యాసింజర్లు గాలి ఆడక ఉక్కిరిబిక్కిరయ్యారు. ఏం జరుగుతుందో తెలియక పిల్లలతో  పాటు పెద్దలు భయాందోళనలకు గురయ్యారు. విషయం తెలుసుకున్న లక్నో మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ అధికారులు ఎమర్జెన్సీ ఎగ్జిట్‌  ద్వారా ప్రయాణీకులను బయటకు తీసుకొచ్చారు. వారందరినీ మరో మెట్రో ట్రైన్‌లో గమ్యస్థానాలకు పంపారు.